Pages

Monday, September 15, 2014

మిత్రమ...


శ్వాసను  ఆగిపోని 
కట్టను  కాలిపోని  
కానీ మిగిలేది 
నువ్వు అన్న అనుభూతే మిత్రమ ||

వికసించిన పువ్వును  రాలిపోని
దాని వద్ద వాలిన తుమ్మెద జారిపోని 
కానీ మిగిలేది
కొన్ని క్షణాల పరిమలమే మిత్రమ ||


నదులను  సముద్రంలో కలిసిపోని
సముద్రపు అలలని తీరాలు దాటిపోని
కానీ మిగిలేది
చివరికి అది నీరేకదా మిత్రమ ||

వేసే దుస్తులు వాడిపోని
సేవించే ఆహరం మారిపోని
కానీ మిగిలేది
నిరాకకై ఎదురుచూసే నేనే మిత్రమ ||


                                                                              -         అభిజిత్ జయంతి

0 comments: