ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం,
Saturday, May 29, 2010
ఓ మనసా ఓ మనసా...
ఓ మనసా ఓ మనసా ...
చెబితే వినవా నువ్వు...నీ మమతే మాయ కదా,
నిజమే కనవా నువ్వు...చెలియ గుండె దక్కలేక పలకనందే నా మౌనం,
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం,
గతమే మరచి బ్రతకలే మనసా...
ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం,
తపన పడి ఎం లాభం అందని జాబిలి జతకోసం,
కలిసి వున్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో,
కలిసి రాని ప్రేమతీరం తీరిపోయిన ఋణమనుకో,
మిగిలే స్మృతులే మరవద్దు ఓ మనసా...
తన ఒడిలో పొదుముకుని భద్రంగానడిపే నౌక,
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరాదుగా,
కడలిలోనే ఆగుతుందా కధలనంటున్న ఈ పయనం,
వెలుగు వైపు చూడనంద నిద్రలేచే నా నయనం,
కరిగే కాలాన్ని తరిమే ఓ మనసా...